త్రివిక్రమ్, తమన్ మధ్య గొడవలు?

త్రివిక్రమ్, తమన్ కాంబినేషన్ గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో మ్యూజికల్ గా దుమ్మురేపింది. వీరి ప్రయాణం సూపర్ హిట్ గా సాగింది. కానీ ఇప్పుడు సడెన్ గా త్రివిక్రమ్ రూట్ మార్చడం చర్చనీయాంశమైంది. వెంకటేశ్ తో చేయబోయే సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ ను ఎంచుకున్నట్లు టాక్. దీంతో త్రివిక్రమ్, తమన్ మధ్య గొడవల వచ్చాయి అంటూ సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.
త్రివిక్రమ్ కి గతంలో దేవి శ్రీ ప్రసాద్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగానే తమన్ కు ఫిక్స్ అయ్యారని, ఇప్పుడు తమన్ తో కూడా అలాగే చెడిందా అని కొందరు గుసగుసలాడుకుంటున్నారు.అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఇందులో ఎలాంటి గొడవలు లేవని తెలుస్తోంది. త్రివిక్రమ్ ఎంతో హుందాగా ఉండే వ్యక్తి. ఆయనతో పని చేయడం చాలా సరదాగా ఉంటుందని, ఆయనతో మాట్లాడితే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయని ఇండస్ట్రీలో అందరూ చెబుతుంటారు.
అలాంటి వ్యక్తి చిన్న చిన్న కారణాలకు గొడవపడి మ్యూజిక్ డైరెక్టర్లను దూరం పెడతారంటే నమ్మశక్యంగా లేదు.నిజానికి ఒకే కాంబినేషన్ రిపీట్ అవుతుంటే ఆడియన్స్ కు బోర్ కొట్టడం సహజం. బహుశా దాన్ని బ్రేక్ చేయడానికే త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. క్రియేటివ్ ఫీల్డ్ లో ఎప్పుడూ కొత్తదనం కోరుకోవడం చాలా ముఖ్యం. ఆ గ్యాప్ వచ్చినంత మాత్రాన అది గొడవ అనుకోవడం పొరపాటే అవుతుంది.త్రివిక్రమ్ కు మ్యూజిక్ విషయంలో ఎప్పుడూ కొత్త ప్రయోగాలు చేయడమంటే చాలా ఇష్టం. అందుకే కొత్త వాళ్ళతో పని చేస్తున్నారని తెలుస్తుంది.



