తెలంగాణ
అల్వాల్ పీఎస్‌లో ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిపై ఫిర్యాదు

Jagadish Reddy: అల్వాల్ పీఎస్‌లో ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. స్పీకర్ ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అల్వాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, కో కన్వీనర్ యాదగిరి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.
జగదీష్‌రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై చిన్న చూపు చూస్తే రాజకీయ సన్యాసిగా చేస్తామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం జగదీష్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.