తెలంగాణ
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. బీబీపేటలోని పెద్దచెరువు నిండుకుండలా మారింది.దీంతో చెరువు కట్టకు గండి పడే ప్రమాదం ఉంది. చెరువుకు గండి పడితే మూడు గ్రామాలకు ప్రమాద ముంపు పొంచి ఉంది. చెరువుకు గండి పడకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.



