తెలంగాణ
కొత్తగూడెంలో కాలేజీ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. మొండికుంట ఎల్లమ్మ తల్లి గుడి వద్ద కాలేజ్ బస్సు బోల్తా పడింది. పలువురు విద్యార్ధులకు గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది విద్యార్ధులు ఉన్నారు. మణుగూరు నుండి పాల్వంచ కాలేజ్‌కి వెళ్తుండగా ఘటన జరిగింది.



