ఆంధ్ర ప్రదేశ్
మన్యం జిల్లాను కమ్మేసిన పొగమంచు

పార్వతీపురం మన్యం జిల్లాను పొగమంచు కమ్మేసింది. తెల్లవారుజామున నుంచే దట్టమైన మంచు కమ్ముకోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్వతీపురం పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో ఉదయం వేళ దట్టమైన మంచు కమ్ముకోవడంతో రహదారులు స్పష్టంగా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పనుల నిమిత్తం బయలుదేరే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలితో పాటు దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.



