తెలంగాణ
కాళేశ్వరం లో కమ్మేసిన పొగమంచు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. 353 వ జాతీయ రహదారిపై దారి కనపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి పూట చలి వణికిస్తుంటే తెల్లవారుజామున పొగమంచుతో అవస్థలు పడుతున్నారు.
ఉదయం 8 దాటిన పొగమంచు అలానే ఉండడంతో విద్యార్థులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అటూ కాళేశ్వరాలయ దర్శనానికి వచ్చిన భక్తులు గోదావరి తీరం వద్ద పూర్తిగా పొగమంచు కమ్మెయడంతో అవస్థలు పడ్డారు. ఆలయం రాజగోపురం, ప్రధాన ఆలయం ,పరిసరాలు పూర్తిగా పొగమంచుతో కప్పబడింది.



