తెలంగాణ
హుజూరాబాద్‌లో పెరిగి చలి తీవ్రత

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో చలి తీవ్రత పెరిగింది. పొగ మంచు దట్టంగా కమ్మేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగ మంచుకు ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక లైట్లు వేసుకొని వాహనాలు నడుపుతున్నారు వాహనదారులు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇంటి నుండి బయటకు రావడం లేదు జనం. ముఖ్యంగా హుజురాబాద్, శంకరపట్నం, వీణవంక మండలాల్లో పొగ మంచు ప్రభావం ఎక్కువగా ఉంది.



