తెలంగాణ

Hyderabad: మండి బిర్యానీలో బొద్దింక.. కస్టమర్ల ఆగ్రహం

Hyderabad: మండి బిర్యానీ తినేందుకు వెళ్లిన కస్టమర్లకు చేదు అనుభవం ఎదురైంది. మండి బిర్యానీలో బొద్దింక రావడం చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. హైదరాబాద్ మలక్‌పేట పరిధిలోని మూసారాం బాగ్ చౌరస్తాలో ఉన్న ఆజెబో రెస్టారెంట్‌లో కస్టమర్లు మండి ఆర్డర్ చేశారు.

అయితే ఆర్డర్ చేసిన కస్టమర్ ప్లేట్‌లో బొద్దింక ప్రతక్షమవడంతో వెంటనే రెస్టారెంట్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button