తెలంగాణ
Singareni: ఎడతెరిపిలేని వర్షం.. సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

Singareni: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. బెల్లంపల్లి రీజియన్ ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మందమర్రి ఏరియా, కాసిపేట్ ఓపెన్ కాస్ట్, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ ఏరియాలలో ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు వెలికితీత పనులు అయితే నిలిచిపోయాయి.
భారీగా చేరిన నీటిని మోటార్ల ద్వారా బయటికి తరలిస్తున్నారు. అయినప్పటికీ వర్షం ఏకధాటిగా కురుస్తుండడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మట్టి వెలికితీత పనులు సైతం ఆగిపోవడంతో బెల్లంపల్లి రీజియన్ వ్యాప్తంగా భారీ నష్టం ఏర్పడింది.