తెలంగాణ
ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ భవనం దగ్గర సభ జరగనుంది. సర్వం సిద్ధం పేరుతో సభ ఏర్పాటు జరిగింది. వర్సిటీలో సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే వెయ్యి కోట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులు, అధ్యాపకుల సూచనలతో వర్సిటీ డీపీఆర్ రెడీ అయింది. యూనివర్సిటీ అభివృద్ధి ప్రణాళికను విడుదల చేయనున్నారు. ఓయూలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయనున్నారు సీఎం రేవంత్.



