తెలంగాణ
Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి నేడు ఢిల్లీకి బయల్దేరనున్నారు. AICC కీలక నేతలతో సమావేశంకానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఢిల్లీ టూర్‌తో కేబినెట్ విస్తరణపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెలాఖరు లేదా వచ్చేనెల మొదటి వారంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగితే నలుగురు లేదా ఐదుగురికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రాతినిధ్యం లేని జిల్లాలు, సామాజిక వర్గాలకు ఛాన్స్ ఉండనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కేబినెట్‌లో చోటుదక్కనివారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశం కన్పిస్తోంది. ఇక పార్టీ పదవులతోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా కసరత్తు జరిగే ఛాన్స్ ఉంది.