తెలంగాణ

Revanth Reddy: మూసీ ప్రక్షాళన చేస్తామంటే ..మాపై ఎన్నో విమర్శలు

Revanth Reddy: మూసీ ప్రక్షాళనపై తెలంగాణ శాసనసభలో చర్చ జరిగింది. మూసీ ప్రక్షాళన కోసం నెలల తరబడి అధికారులతో సమీక్షలు చేశామని సీఎం రేవంత్ తెలిపారు. అనంతగిరి హిల్స్ నుంచి వాడపల్లి వరకు మూసీ ప్రవహిస్తోందన్నారు. మూసీ, ఈసా నదులు కలిసే బాపూ ఘాట్ దగ్గర గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తామన్నారు.

హైదరాబాద్‌కు వరద ముప్పు తప్పించేందుకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను నిజాం నిర్మించారన్నారు. మూసీ ప్రక్షాళన చేస్తామంటే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సబర్మతి ప్రాజెక్ట్‌లో 60 వేల కుటుంబాలను తరలించారని యూపీలో గంగా నది ప్రక్షాళనతో వేల మందిని తరలించారని తెలిపారు. మూసీని ప్రక్షాళన చేస్తామంటే ప్రతిపక్షాలకు అంత కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button