తెలంగాణ
Revanth Reddy: నల్లమల డిక్లరేషన్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: పహల్గామ్ ఘటన తర్వాత ప్రధాని అంటే ఇందిరాగాంధీలా ఉండాలనే చర్చ దేశవ్యాప్తంగా జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ గతంలో పాకిస్థాన్‌తో యుద్ధం చేసి ఆ దేశాన్ని రెండు ముక్కలు చేసిన ఘనతను గుర్తు చేశారు. 50 ఏళ్లు గడిచినా ఇందిరాగాంధీ పేరును ప్రజలు తలుచుకుంటున్నారంటే ఆమె పాలన ఎంత గొప్పదో అర్థమవుతుందన్నారు. ప్రతి ఆదివాసీ గుండెల్లో ఇందిరమ్మ చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు.
నల్లమల ప్రాంత సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పోడు భూములను వ్యవసాయానికి అనుకూలంగా మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.నల్లమల డిక్లరేషన్’ను కూడా ఆయన ఆవిష్కరించారు.