తెలంగాణ
కేంద్రమంత్రి నిర్మలను కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు.ఇటీవల తెలంగాణలో భారీ వర్షాల కారణంగా జరిగిన పంట, ఆస్తి నష్టంపై అధికారులు ఇచ్చిన నివేదకను కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్‌కు అందజేశారు. అనుకోని విపత్తుతో సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రానికి వెంటనే నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతోన్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటును సీఎం రేవంత్ రెడ్డి, నిర్మలా సీతారామన్‌కు వివరించారు. వాటి నిర్మాణానికి కేంద్రం నుంచి కూడా నిధులు మంజూరు చేయాలని కోరారు.



