తెలంగాణ
Revanth Reddy: స్థానిక ఎన్నికల నిర్వహణపై.. ఇవాళ సీఎం రేవంత్ కీలక సమీక్ష

Revanth Reddy: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ వ్యూహ రచన చేస్తుంది. ఇందుకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అమలుకు 3 మార్గాలను పరిశీలిస్తోంది ప్రభుత్వం.
ఆప్షన్ 1- రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడం ఆప్షన్ 2- రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యేలా చేయడం.ఆప్షన్ 3- పార్టీ పరంగా బీసీలకు 42శాతం సీట్లు కేటాయించడం లాంటి అంశాలను రేవంత్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.