తెలంగాణ
Revanth Reddy: ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన రేవంత్

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీలో ఆయన మొక్కలు నాటారు. బొటానికల్ గార్డెన్స్‌లో రుద్రాక్ష మొక్క నాటారు. కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం తిలకించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 18.03 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు.