తెలంగాణ
Revanth Reddy: నేడు సీఎం రేవంత్ బిజీ షెడ్యూల్

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ బిజీబిజీగా గడపనున్నారు. కాసేపట్లో విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11గంటల 30నిమిషాలకి టూరిజంపై సమీక్ష నిర్వహించ నున్నారు. మధ్యాహ్నం 3గంటల 30నిమిషాలకి గాంధీ భవన్‌లో టీ.పీసీసీ భేటీ జరగనుంది. సమావేశంలో కులగణన వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమం.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగనుంది. ప్రజెంటేషన్ కార్యక్రమంలో పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మున్షీ పాల్గొననున్నారు. అలాగే సాయంత్రం 5గంటలకి జలవిహార్‌లో.. విజయ తెలంగాణ పుసక్తావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.