తెలంగాణ
కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విషెస్ చెప్పారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని ట్వీట్ చేశారు. కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు… నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి.