తెలంగాణ
సీవీ ఆనంద్ కుమారుడి రిసెప్షన్‌కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో సీవీ ఆనంద్ కుమారుడు నిఖిల్-వాసంతి రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ రిసెప్షన్ వేడుకకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. సీఎం రేవంత్ తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటి రెడ్డి తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.



