తెలంగాణ

Revanth Reddy: భారత ఫుట్‌బాల్ చరిత్రలో హైదరాబాద్‌కు విశేషమైన గుర్తింపు ఉంది

Revanth Reddy: గచ్చిబౌలి స్టేడియంలో బీఎన్ మల్లిక్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ టోర్నీ నిర్వహించారు. విజేతగా నిలిచిన సీఐఎస్‌ఎఫ్ జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి ట్రోఫీని అందించారు.భారత ఫుట్‌బాల్ చరిత్రలో హైదరాబాద్‌కు విశేషమైన గుర్తింపు ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఒకప్పుడు నగరాన్ని ‘నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్‌బాల్’గా పిలిచేవారని గుర్తుచేశారు. నేటి యువత క్రీడా మైదానాలను వదిలిపెట్టి పబ్, డ్రగ్స్ సంస్కృతికి బానిసలవుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణను మరో పంజాబ్‌లా మారనివ్వబోమని, డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేశారు. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒలింపిక్స్‌లో పతకాలు సాధించలేకపోతుంటే, 4 కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియా 30కి పైగా పతకాలు సాధిస్తోందన్నారు. యువతను క్రీడల వైపు మళ్లించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button