తెలంగాణ
Revanth Reddy: నేడు సీఎం రేవంత్ ఏరియల్ సర్వే

Revanth Reddy: తెలంగాణను మొంథా తుఫాన్ ఆగం చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం రేవంత్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. తుఫాన్ బాధితులను ఆదుకుంటామన్నారు సీఎం రేవంత్. ధాన్యం సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.



