తెలంగాణ
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్రమంత్రిని సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. ఈసా, మూసీ నదుల సంగమం వద్ద గాంధీ చితభస్మాన్ని నిమజ్జనం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. బాపూఘాట్‌ను ప్రపంచస్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలవనున్నట్లు రేవంత్ తెలిపారు.



