Nitish Kumar: బీహార్ మహిళలకు సీఎం నితీష్ కుమార్ గుడ్‌న్యూస్

Nitish Kumar: బీహార్ మహిళలకు ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ భారీ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో బీహార్ మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. మహిళా సాధికారత, వారికి ఉపాధి కల్పించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను బలోపేతం చేసే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది బీహార్ సర్కార్. దీంతో పాటు యూత్‌ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా నితీష్ కుమార్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, వృత్తి శిక్షణ, నైపుణ్యాలను పెంపొందించడం కోసం బీహార్ యువజన కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రైవేట్ రంగంలో నాణ్యమైన విద్య, నైపుణ్యం, ఉద్యోగ నియామకాలను మెరుగుపరచడాన్ని బీహార్ యూత్ కమిషన్ పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ కమిషన్‌కు ఒక చైర్ పర్సన్, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఏడుగురు సభ్యులు ఉంటారు. 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారే యూత్ కమిషన్లో ఉంటారని స్పష్టం చేసింది ప్రభుత్వం.