తెలంగాణ
Revanth Reddy: సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ సమావేశం

Revanth Reddy: నేడు అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎల్పీ భేటీ కానుంది. మధ్యాహ్నం 2గంటలకు రేవంత్ అధ్యక్షతన సమావేశం ప్రారంభంకానుంది. సమావేశంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. సీఎం రేవంత్ పలు అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు.