జాతియం

ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్

ఉత్తరాఖండ్‌లో మరోసారి మెరుపు వరదలు సంభవించాయి. చమోలీ జిల్లాలో కుంభవృష్టి కురిసింది. దీంతో అనేక నివాసాలను వరద నీరు ముంచెత్తింది. వాహనాలు బురదలో కూరుకుపోయాయి. సగ్వారా గ్రామంలో ఓ యువతి శిథిలాల కింద కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. వరదల కారణంగా పలువురు గల్లంతయ్యారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.

ఇళ్లల్లో చిక్కుకుపోయిన స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి ఎక్స్‌ వేదికగా స్పందించారు. స్థానిక యంత్రాంగంతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button