తెలంగాణ
బీఆర్ఎస్-కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ

హైదరాబాద్ అల్వాల్‌లో హైటెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్-కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. బోనాల ఉత్సవాల్లో చెక్కులు పంపిణీ చేస్తుండగా గొడవ రాజుకుంది. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అయితే వేదికపై బీఆర్ఎస్ కార్పొరేటర్‌కి సీటు కేటాయించకపోవడంతో వివాదం మొదలైంది.
అంతేకాదు వే దికపై కాంగ్రెస్ నేతలను ఒక్కరినే కూర్చోబెట్టడంపై బీఆర్ఎస్ కేడర్ ప్రశ్నిస్తోంది. మొత్తానికి ఇరువర్గాల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో చెక్కులు పంపిణీ చేయకుండానే వెళ్లిపోయారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. మరోవైపు జరిగిన ఘటనపై పీఎస్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చారు MLA మర్రి రాజశేఖర్ రెడ్డి.