ఆంధ్ర ప్రదేశ్
న్యూ ఇయర్ వేడుకల్లో యువకుల మధ్య ఘర్షణ.. చాకు, బీర్ బాటిల్స్‌తో దాడి

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలు విషాదంగా మారాయి. పీ.గన్నవరం మండలం ఉడిముడిలో నూతన సంవత్సర వేడుకల్లో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ హింసాత్మకంగా మారి కత్తి, బీర్ బాటిల్స్‌తో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఉడిముడి గ్రామంలోని శివాలయం సమీపంలో ఓ వర్గం యువకులు న్యూ ఇయర్ వేడుకలకు ఏర్పాట్లు చేసుకోగా అక్కడికి వచ్చిన ఇంకో వర్గం యువకులు కవ్వింపు చర్యలకు పాల్పడి వారితో గొడవకు దిగారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో 14 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.



