ఆంధ్ర ప్రదేశ్

మాజీమంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై క్లారిటీ

మాజీమంత్రి, వైసీపీ నేత కొడాలి నాని ఆరోగ్యంపై క్లారిటీ వచ్చింది. గ్యాస్ట్రిక్ సమస్యతోనే కొడాలి నాని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కొడాలి నాని ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ట్వీట్ వెలువడింది. ప్రస్తుతం కొడాలి నాని క్షేమంగా ఉన్నారని ట్వీట్‌లో వివరణ ఇచ్చారు.

ముఖ్యంగా గుండెపోటు వదంతులను నమ్మకండంటూ క్లారిటీ ఇచ్చారు. కాగా ఉదయం కొడాలి నానికి గుండెపోటు అంటూ వార్తలు ప్రసారమయ్యాయి. దీంతో కొడాలి ఎక్స్ ఖాతా నుండి అధికారికంగా ట్వీట్ వెలువడింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button