ఆంధ్ర ప్రదేశ్
Jogi Ramesh: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు నోటీసులు

Jogi Ramesh: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. తాజాగా సీఐడీ నోటీసులకు స్పందించారు జోగి రమేష్. ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీ సుల్లో పేర్కొన్నారు అధికారులు. అయితే ఇప్పటివరకు తాడిగడపలోని సీఐడీ ఆఫీస్‌కి మాత్రం ఇంకా జోగి రమేష్ రాలేదు. దీంతో జోగి రమేష్ నేటి విచారణకు హాజరుపై ఉత్కంఠ నెలకొంది.
సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు రావాలని సీఐడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన ఆధారాలుంటే తేవాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకవేళ జోగి రమేష్ విచారణకు హాజరుకాకపోతే..? సీఐడీ అధికారుల స్పందన ఎలా ఉండబోతుందోనని ఉత్కంఠ నెలకొంది.