తెలంగాణ
కాంగ్రెస్ నాయకులకు భోజనాలు వడ్డించిన సీఐ

నకిరేకల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఖాకీ గౌరవంపై తీవ్ర చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. పోలీస్ అధికారిగా విధులు నిర్వహించాల్సిన నకిరేకల్ సీఐ వెంకటేశ్వర్లు అధికార కాంగ్రెస్ నాయకులకు భోజనాలు వడ్డించారు. కొసరి కొసరి వడ్డించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశం సహా అధికార పార్టీ నాయకులకు సీఐ వెంకటేశ్వర్లు స్వయంగా భోజనాలు వడ్డించడం వివాదాస్పదంగా మారింది.
కార్యక్రమంలో సీఐ క్యాటరింగ్ సిబ్బంది మాదిరిగా వ్యవహరించడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఐ ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఖాకీ మర్యాదపై చర్చ మొదలైంది. ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందిస్తారా? శాఖాపరమైన విచారణ చేపడతారా? అన్న చర్చ నియోజకవర్గంలో మొదలైంది.



