సినిమా

Chiranjeevi: డ్రిల్ మాస్టర్ గా ఆకట్టుకోనున్న మెగాస్టార్‌!

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు అనిల్‌ రావిపూడి కొత్త సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. చిరు కొత్త లుక్‌లో ఆకట్టుకోనున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. నయనతార కథానాయికగా నటిస్తుండగా, శివశంకర వరప్రసాద్‌ పాత్రలో చిరు స్కూల్‌ డ్రిల్‌ మాస్టర్‌గా కనిపించనున్నారని సమాచారం. ముస్సోరీలో రీసెంట్‌ షెడ్యూల్‌లో స్కూల్‌ బ్యాక్‌డ్రాప్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

చిరు, నయనతారతో పాటు ప్రధాన తారాగణం ఈ సీన్స్‌లో పాల్గొన్నారు. వెంకటేశ్‌ గెస్ట్‌ రోల్‌లో, క్యాథరీన్‌ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో టాక్‌. సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మాణంలో, శ్రీమతి అర్చన సమర్పణలో షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. సంక్రాంతి 2026లో గ్రాండ్‌ రిలీజ్‌కు మేకర్స్‌ సిద్ధమవుతున్నారు. అనిల్‌ మార్క్‌ కామెడీ, చిరు ఎనర్జీతో ఈ మూవీ మాస్‌ హిట్‌ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button