సినిమా

విశ్వంభర: ఆసక్తి రేపుతున్న స్పెషల్ అప్డేట్?

Viswambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రం అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. సోషియో ఫాంటసీ జోనర్‌లో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయనుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. స్పెషల్ సాంగ్‌తో సినిమా మరింత ఆకర్షణీయంగా ఉండనుంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రం అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఈ సోషియో ఫాంటసీ మూవీలో చిరంజీవి బీమవరం దొరబాబుగా కనిపించనున్నారని టాక్. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ అభిమానులను అలరించనుంది. ఈ పాట చిరంజీవి నటించిన ఖైదీ సినిమాలోని రగులుతోంది మొగలిపొద అనే హిట్ సాంగ్‌కు రీమిక్స్ వెర్షన్‌గా రూపొందుతున్నట్లు సమాచారం.

ఈ సాంగ్‌లో చిరంజీవితో పాటు బాలీవుడ్ నటి మౌనీ రాయ్ డాన్స్ చేయనుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న ఈ పాట షూటింగ్ త్వరలో పూర్తవనుంది. సినిమా గ్రాఫిక్స్, విజువల్స్‌పై భారీగా కసరత్తు చేస్తున్న చిత్ర బృందం, విడుదల తేదీపై స్పష్టత కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button