సినిమా
మాట నిలబెట్టుకున్న చిరంజీవి..!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన హామీని నెరవేర్చారు. సరిగమప లిటిల్ ఛాంప్స్ ఫేమ్ చిన్నారి వరుణవికి 5 లక్షల రూపాయల చెక్ అందజేశారు. ఈ మానవత్వం అందరినీ కదిలించింది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి తన మాటకు కట్టుబడి మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. జీ తెలుగు సరిగమప లిటిల్ ఛాంప్స్‌లో అద్భుత పాటతో అందరి హృదయాలను గెలుచుకున్న చిన్నారి వరుణవికి ఆమె భవిష్యత్తుకు పూర్తి సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు నెరవేర్చారు.
తన కుమార్తె సుష్మిత ద్వారా వరుణవికి 5 లక్షల రూపాయల చెక్ అందజేశారు. ఈ చిన్నారి పాటకు ముగ్ధులైన చిరంజీవి ఆమె తల్లిదండ్రులకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని చెప్పారు. ఈ హార్ట్ టచింగ్ మూమెంట్ అభిమానులను కన్నీళ్లతో ముంచెత్తింది. చిరంజీవి మానవత్వం మరోసారి నిరూపితమైంది.



