టాలీవుడ్

Chiranjeevi: సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి హాజరుకాని చిరంజీవి..

Chiranjeevi: సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి హాజరుకాని చిరంజీవి..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం ప్రారంభమయింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ సమావేశం కొనసాగుతోంది. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ హాజరయ్యారు.

సినీ పరిశ్రమ తరపున మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారని ప్రచారం జరిగింది. అయితే, ఆయన ఈ సమావేశానికి హాజరు కాలేదు. చిరంజీవి ఎందుకు రాలేదనే అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే, హైదరాబాద్ లో లేకపోవడం వల్లే సమావేశానికి చిరంజీవి రాలేకపోయారని తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button