అంతర్జాతీయం

China: అమెరికాతో పోటీ.. భారీ యుద్ధ నౌకను ప్రారంభించిన చైనా!

China: సముద్ర జలాలపై ఆధిపత్యం కోసం సాగుతున్న పోరులో చైనా పెను సంచలనం సృష్టించింది. అమెరికా నౌకాదళానికే సవాల్ విసురుతూ.. తన అత్యంత శక్తిమంతమైన, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఫుజియాన్‌ను జలప్రవేశం చేయించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్వయంగా ఈ మహా యుద్ధనౌకను ప్రారంభించి, ప్రపంచానికి తమ సైనిక సత్తాను చాటిచెప్పారు. ఇంతకీ ఈ నౌక ప్రత్యేకతలేంటి..? దీని రాకతో హిందూ-పసిఫిక్ మహాసముద్రంలో బల సమీకరణాలు ఎలా మారనున్నాయి..? దీనిపై అగ్రరాజ్యం రియాక్షన్ ఎలా ఉండబోతోంది.?

కయ్యాలమారి చైనా మళ్లీ కవ్వింవు చర్యలకు కాలుదువ్వేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నావికా దళంలో అమెరికాతో పోటీ పడేందుకు చైనా తన ఆయుధ సంపత్తిని విస్తరిస్తోంది. అందులోభాగంగా అత్యంత సామర్థ్యం కలిగిన ఫుజియాన్‌ టైప్‌-003 యుద్ధ నౌకను తాజాగా ప్రారంభించింది.

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన ఈ విమాన వాహన నౌకను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రారంభించారు. హైనాన్‌ ద్వీపంలోని సైనిక నౌకాశ్రయంలో దీనికి సంబంధించిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ యుద్ధ నౌకను పరిశీలించారు.

కాగా ఫుజియాన్‌ చైనాకు చెందిన మూడో అత్యంత అధునాతన యుద్ధ నౌక. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ విమాన వాహక నౌకను ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రారంభించారు. విద్యుదయస్కాంత ఆధారిత వ్యవస్థ అయిన ఇమాల్స్‌ ను ఇందులో వినియోగించారు. 316 మీటర్ల పొడవు, 80వేల టన్నుల బరువు ఉన్న ఈ ఫుజియాన్‌కు దాదాపు 50 విమానాలను మోసే సామర్థ్యం ఉంది.

ఈ ఎమాల్స్‌ వ్యవస్థను అమెరికాకు చెందిన గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ శ్రేణి విమాన వాహన నౌక మాత్రమే వాడుతున్నాయి. ఇప్పటివరకు ఈ అత్యాధునిక సాంకేతికత కేవలం అమెరికాకు చెందిన గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ శ్రేణి విమాన వాహక నౌకల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు చైనా కూడా ఆ టెక్నాలజీని సొంతం చేసుకుని, అమెరికా సరసన నిలిచింది.

కాగా ఫుజియాన్‌ అనేది చైనాలో ఓ ప్రావిన్స్‌. ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ సుప్రీం లీడర్‌గా ఎదగడానికి ముందు ఇక్కడ కొన్నేళ్లపాటు పనిచేశారు. తైవాన్‌ జలసంధిని పర్యవేక్షించేది కూడా ఈ ప్రావిన్స్‌లోని పీఎల్‌ఏ నేవీ తూర్పు సముద్ర దళమే. ఈ నౌక పూర్తిగా సిద్ధమయ్యాక ఇక్కడే మోహరిస్తారనే అంచనాలున్నాయి. ఇప్పటికే దక్షిణ, తూర్పు చైనా సముద్రాలు, పశ్చిమ పసిఫిక్‌లో అమెరికా యుద్ధ నౌకల రాకపోకలను అడ్డుకోవడంపై బీజింగ్‌ దృష్టిపెట్టింది. సాధారణంగా విమాన వాహక నౌక ఒక్కదాన్నే మోహరించరు. దాంతోపాటు పలు చిన్న సైజు యుద్ధ నౌకలు, జలాంతర్గాముల బృందం ఉంటుంది.

1998లో సోవియట్‌ కాలం నాటి ఓ అసంపూర్తి ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్‌ను చైనా కొనుగోలు చేసింది. 2012 నాటికి దాన్ని తీర్చిదిద్ది.. లియోనింగ్‌ పేరిట దళాల్లో చేర్చింది. ప్రస్తుతం శిక్షణ నిమిత్తం దీనిని వాడుతున్నారు. ఆ తర్వాత షాన్‌డాంగ్‌ పేరిటో మరో భారీ నౌకను నిర్మించి 2019లో అందుబాటులోకి తెచ్చింది. దీనిపై జే-15, సుఖోయ్‌ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. తాజాగా ఫుజియాన్‌ ‌ను ప్రవేశపెట్టింది.

ఇటీవల ఈ ఫుజియాన్‌ గురించి జిన్‌పింగ్‌ మాట్లాడుతూ ఇది సాయుధ దళాల ఆధునికీకరణలో కీలకమైన మైలురాయి అని అభివర్ణించారు. బీజింగ్‌కు ఈ నౌక వ్యూహాత్మక సాధనం అవుతుందని, తమ దేశ గౌరవాన్ని పెంచుతుందన్నారు. ఈ యుద్ధనౌక కేవలం ఆయుధం మాత్రమే కాదని, ఇది తమ దేశ గౌరవాన్ని పెంచే వ్యూహాత్మక సాధనమని చైనా అధికారికంగా ప్రకటించింది. దక్షిణ చైనా సముద్రంలో, తైవాన్ విషయంలో అమెరికా జోక్యాన్ని నిలువరించడంలో ఫుజియాన్ కీలక పాత్ర పోషిస్తుందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


ఇదిలా ఉండగా మరో విమాన వాహక నౌకను నిర్మించేందుకు చైనా సన్నాహాలు మొదలుపెట్టింది. టైప్‌-004గా ఇది రానుంది. ఇందులో ఎమాల్స్‌ సాంకేతికతతో పాటు అణు సామర్థ్యంతో దీన్ని నిర్మించాలని బీజింగ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అమెరికా అణువాహక నౌకలకు పూర్తిస్థాయిలో పోటీ ఇవ్వగలదని అంచనా. ఒకప్పుడు నావికా బలగంలో వెనుకబడిన చైనా, ఇప్పుడు అమెరికాతో పోటీ పడుతూ తన ఆయుధ సంపత్తిని విస్తరిస్తున్న తీరు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

చైనా ప్రస్తుతం అమెరికాను చేరుకోగల 400 దీర్ఘ-శ్రేణి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను కలిగి ఉందని, దాని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 1,300 అణ్వాయుధ సామర్థ్యం గల మీడియం-రేంజ్ క్షిపణులను కలిగి ఉంది. చైనా తన అణ్వాయుధాలను నిల్వ చేయడానికి మూడు కొత్త గోతులను కూడా నిర్మించింది. 550 ICBM లాంచర్‌లను కలిగి ఉంది. బీజింగ్ 50 లాంచర్‌లను, అదే సంఖ్యలో ICBMలను జోడించిందని నివేదిక తెలిపింది.

గత ఏడాది కాలంలోనే US చేరుకోవడానికి కష్టపడింది చైనా. బీజింగ్ ఇప్పుడు US కంటే ఎక్కువ ICBM లాంచర్‌లను కలిగి ఉంది. దాని DF-31A ICBM, DF-5 ద్రవ ఇంధన క్షిపణుల సంఖ్యను పెంచింది. చైనా తన అణ్వాయుధాల సంఖ్యను పెంచుకోవడమే కాకుండా వాటిని వైవిధ్యభరితంగా మారుస్తూ తన అణ్వాయుధాలను మరింత ప్రాణాంతకంగా మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

చైనా నావికాదళం ప్రపంచంలోనే అతిపెద్ది. ప్రస్తుతం 6 అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు, 6 అణుశక్తితో నడిచే అటాక్ సబ్‌మెరైన్‌లు, AIP సాంకేతికతతో కూడిన 48 డీజిల్‌తో నడిచే జలాంతర్గాముల విమానాల సముదాయాన్ని కలిగి ఉంది. ఇది ఆవేశపూరిత వేగంతో అభివృద్ధి చెందుతుంది. చైనా తమ జలాంతర్గామి నౌకలను వచ్చే ఏడాది చివరి నాటికి 65కి, 2035 నాటికి 80కి పెంచుకోవచ్చన్న అంచనాలు ఉన్నాయి.

భవిష్యత్తులో, ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రాన్ని ఆక్రమించడం ప్రారంభించిన చైనా నావికా దళ ఆధిపత్యానికి ఎటువంటి సవాలు లేకుండా ఉండేలా చూస్తుందట. చైనా కృత్రిమ ద్వీపాలను నిర్మిస్తోందని, దాని పొరుగున ఉన్న ఫిలిప్పీన్స్, జపాన్‌లను బెదిరిస్తోందని, అలాగే సమీప భవిష్యత్తులో తైవాన్‌ను ఆక్రమించుకోవాలని భావిస్తోందని సమాచారం.

ఇక చైనా వద్ద ప్రస్తుతం 370 యుద్ధనౌకలు ఉన్నాయి. 2025 చివరి నాటికి వాటి సంఖ్య 395కు చేరుతుందని, 2030 నాటికి 435 యుద్ధనౌకలు చేరుతాయన్న అంచనాలు ఉన్నాయి. చైనా వైమానిక దళం, US వైమానిక దళంతో సమానంగా లేనప్పటికీ, దాని ర్యాంక్‌లలో కొత్త అధునాతన యుద్ధ విమానాలు, సైనిక డ్రోన్‌లను కలుపుకొని వేగంగా పరివర్తన చెందుతోందని అంటున్నారు. మరి చూడాలి దీనిపై అగ్రరాజ్యం ఏ విధంగా స్పందిస్తుందో.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button