తెలంగాణ
తులసి మొక్కకు రాఖీ కట్టి పర్యావరణ ప్రేమ చాటిన చిన్నారి

రక్షాబంధన్ సందర్భంగా ఓ చిన్నారి తులసి మొక్కకు రాఖీ కట్టి పర్యావరణంపై ప్రేమను చాటుకుంది. అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకంగా జరుపుకునే రాఖీ పండగను చిన్నారి భిన్నంగా జరుపుకుంది. ప్రకృతే మనకు నిజమైన రక్షకుడిగా భావించిన చిన్నారి గానవి తులసి మొక్కకు రాఖీ కట్టి పర్యావరణాన్ని రక్షించాలని కోరింది. ప్రతి ఒక్కరు మొక్కలను రక్షించాలని చిన్నారి గానవి కోరారు. రక్షాబంధన్ పండుగను కేవలం మానవ బంధాలకు మాత్రమే కాకుండా, ప్రకృతితోనూ బంధం కట్టే పండుగగా మార్చింది ఈ చిన్నారి గానవి.



