ఆంధ్ర ప్రదేశ్

Visakhapatnam: దారుణం.. కాలువలో చిన్నారి శరీరభాగాలు కలకలం

Visakhapatnam: విశాఖపట్నంలో దారుణం జరిగింది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చిన్నారిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. చిన్నారిని హత్య చేయడంతో పాటు శరీర భాగాలను వేరు చేసి కాలవలో పడేసి వెళ్లారు. ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు కాలవలో చిన్నారికి సంబంధించిన కాళ్లు, చేతులు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు.

చిన్నారి శరీర భాగాలను నరికి పడేసినట్లుగా పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని చిన్నారి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాలవలో చిన్నారి శరీర భాగాలు పడి ఉండటంతో స్థానికంగా కలకలం రేపుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button