జాతియం
Chartered Flight: ఒడిశాలో కుప్పకూలిన చార్టర్డ్ ఫ్లైట్.. పలువురికి గాయాలు

Chartered Flight: ఒడిశాలో ప్రమాదం చోటు చేసుకుంది. రూర్కెలా వద్ద ఓ చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలిపోయింది. ఈ నైన్ సీటర్ ఫ్లైట్ రూర్కెలా నుంచి భువనేశ్వర్ వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, టేకాఫ్ అయిన వెంటనే ఫ్లైట్ కూలిపోయినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో అందులో ఎనిమిది మంది ఉన్నారు. ఇద్దరు పైలట్లు కాగా ఆరుగురు ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. విమానం కుప్పకూలిన సమచారం తెలియగానే సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన ప్రయాణికులను సమీప ఆసుపత్రికి తరలించారు.



