News

అసెంబ్లీలో గందరగోళం.. నిరసనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. యూరియా కొరతపై ప్లకార్డులతో బీఆర్ఎస్ ఎమ్మల్యేలు నిరసన తెలిపారు. ప్లకార్డులతో సభలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. కాంగ్రెస్ వచ్చింది, యూరియా కొరత వచ్చిందని నినాదాలు చేశారు. ప్లకార్డులతో సభలోకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎంట్రన్స్ దగ్గర మార్షల్స్ అడ్డుకున్నారు.

ప్లకార్డులు బయట వేసి నినాదాలు చేస్తూ శాసనసభ లోపలికి వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సభలోనూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నిరసనపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వశ్చన్ అవర్‌లో నిరసనలు ఏంటని ఫైరయ్యారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button