ఆంధ్ర ప్రదేశ్
ఏపీ శాసనమండలిలో గందరగోళం

ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మండలిలో రచ్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు.
కోవిడ్ సమయంలో 644 కోట్లు బాకీ పెట్టారని మంత్రి లోకేష్ ఆరోపించారు. మీరే బకాయిలు పెట్టి మమ్మల్ని అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య మీద చర్చించేందుకు తాను రెడీ అన్నారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ మాట్లాడతానంటే చర్చ పెట్టాలన్నారు.



