సంక్రాంతి తర్వాత కేంద్ర కేబినెట్‌లో మార్పులు

సంక్రాంతి తర్వాత కేంద్ర కేబినెట్‌లో మార్పులు అంటూ ఫీలర్లు వస్తున్నాయి. పెద్ద పండుగ మూడాలు దాటిన తర్వాత పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధానమంత్రి మోడీ తన మంత్రివర్గ విస్తరణ, మినిస్టర్లను తొలగించడం, మరికొంతమందికి శాఖలు మార్చడం జరుగుతుందని సమాచారం. తెలంగాణ నుంచి మంత్రివర్గంలో ఏ వర్గానికి మంత్రి పదవి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. బీసీల్లో ఓటు బ్యాంకు ఉన్న మున్నూరు కాపు కోటా నుంచి బండి సంజయ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రెడ్డి కోటా నుంచి కిషన్ రెడ్డి కంటిన్యూ అవుతున్నారు.
బండి సంజయ్ తాను పార్టీలో యాక్టివ్ అయ్యేందుకు మంత్రిపదవి వదులుకునేందుకు సిద్దపడ్డట్లు పార్టీలో ఇన్‌సైడ్ టాక్ వచ్చింది. ఎనిమిది మంది ఎంపీలు ఉన్న తెలంగాణలో 2028లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చేందుకు స్కెచ్ వేస్తున్న బీజేపీ..ఎంతమంది ఎంపీలను కొత్తగా కేబినెట్‌లోకి తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కీలకభాగస్వామి చంద్రబాబు నాయుడు నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్నట్లు హస్తినవర్గాలు, అమరావతి సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. ఏపీలో కమ్మ సామాజికవర్గం నుంచి పెమ్మసాని సహాయమంత్రి హోదాలో కొనసాగుతున్నారు. ఈయనకు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది.
దేశంలోనే అత్యధిక ధనవంతుడిగా పెమ్మసాని రికార్డుకెక్కారు. బీసీవర్గం నుంచి రామ్మోహన్ నాయుడు కేబినెట్‌గా ఉన్నారు. కొత్తగా మంత్రిపదవి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే అది ప్యూర్‌లీ చంద్రబాబు నిర్ణయం. కాపులకు ఇస్తారా? బీసీలకు ఇస్తారా? ఎస్టీ ఎస్టీలకు గాని మైనారిటీలకు గాని ఇస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. జాతీయ రాజకీయాల కోణంలో తమిళనాడులో ఎన్నికలు జరుగనుండగా అక్కడ బీజేపీ నేత అన్నామలైకి మంత్రిపదవి ఇస్తారనే ఫీలర్లు వస్తున్నాయి. బిహార్‌లోనూ ఇద్దరికి మంత్రిపదవి అనే వాయిస్ వినిపిస్తోంది. ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్‌లో కొద్దిమందికి అవకాశం కల్పిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



