ఆంధ్ర ప్రదేశ్
నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. కుటుంబంతో పాల్గొన్న సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సంబరాల్లో కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను నారా భువనేశ్వరి, బ్రాహ్మణి పరిశీలించారు.
అలాగే పండుగ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో సీఎం మనవడు దేవాంశ్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక సీఎం చంద్రబాబు తన పర్యటనలో భాగంగా నారావారిపల్లెలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.



