తెలంగాణ
తెలంగాణలో మద్యం ధరలు పెరిగే చాన్స్

మందుబాబులకు భారీ షాక్ తగలనుంది. తెలంగాణలో త్వరలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. మద్యం తయారీ కంపెనీలపై పడింది. గ్యాస్ కొరతతో గాజు సీసాల ఉత్పత్తి తగ్గింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగాయని మద్యం కంపెనీలు వాదిస్తున్నాయి.
మద్యం ధరలు 12 నుంచి 15 శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ధరల పెంపుపై జ్యుడీషియల్ కమిటీతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. త్వరలో మద్యం ధరలపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.



