తెలంగాణ
హరీష్ రావుకు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్

Chamala Kiran Kumar Reddy: హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నీళ్లు-నిజాల పై అసెంబ్లీలో చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానించారని కిరణ్ కుమార్ తెలిపారు. ఎవరు తెలంగాణ ద్రోహి అనేది అసెంబ్లీ సాక్షిగా నిరూపిస్తామన్నారు. గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజం కావన్నారు. ఇప్పటికైనా సీఎం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.



