తెలంగాణ
Chamala: బండి సంజయ్ మాటలు వింటుంటే నవ్వొస్తుంది

Chamala: బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కరీంనగర్ పోగానే బండి సంజయ్ కార్పోరేటర్ మారుతాడని విమర్శలు చేశారు. ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటెయ్యాలి, పాకిస్థాన్ గెలవాలంటే కాంగ్రెస్ ఓటెయ్యాలి అని బండి సంజయ్ మాట్లాడుతుంటె నవ్వోవస్తుందన్నారు.
గ్రాడ్యుయేట్ ఓట్ల కోసం ఇలా మాట్లాడడం సరైంది కాదన్నారు. అభివృద్ధి, నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడకుండా బండి సంజయ్ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒక భాధ్యతగల ఎంపీగా ఆయన వాఖ్యలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని చామల అన్నారు.