తెలంగాణ
తెలంగాణలో మరో ‘టెన్త్’ పేపర్ లీక్.. వాట్సప్‌లో గణిత ప్రశ్నాపత్రం చక్కర్లు

Telangana: కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో గణిత ప్రశ్నాపత్రం లీక్ కేసులో దర్యాప్తు ముమ్మరం అయింది. సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రం ప్రశ్నలు చక్కర్లు కొట్టగా విద్యాశాఖ సీరియస్‌గా తీసుకుంది. దీంతో లీకేజీ కేసులో ఇప్పటికే ఏడుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించిన చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్ మెంట్ ఆఫీసర్ భీమా ఇన్విజిలె టర్ దీపికలను డీఈఓ సస్పెండ్ చేశారు. మరోవైపు ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు.