జాతియం

Anil Ambani: అనిల్ అంబానీ ఇంట్లో సీబీఐ సోదాలు

Anil Ambani: అనిల్‌ అంబానీ ఇంట్లో సీబీఐ దాడులు చేస్తోంది. బ్యాంకులకు సొమ్ముల ఎగవేతపై ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్‌‌పై ఇప్పటికే పలు దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. 17వేల కోట్ల రూపాయల ఎగవేతకు సంబంధించి అనిల్ అంబానీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్ కామ్ వ్యవహారంలో అనిల్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఒక వెలుగు వెలిగిన అనిల్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాజ్యసభ సభ్యుడిగాను పనిచేశారు. అనంతరం వ్యాపారాల్లో నష్టపోయారు.

ధీరూబాయి అంబానీ రెండో కుమారుడైన అనిల్ తొలుత వ్యాపారాల్లో భాగా రాణించారు. ఆయన అన్నయ్య ముఖేష్ అంబానీని మించి వ్యాపారాల్లో దూసుకుపోయారు. వార్తల్లో వ్యక్తిగా క్రేజ్‌ సంపాదించుకున్నారు. అనిల్‌ పొలిటికల్ టర్న్ తీసుకున్నాక సీన్ రివర్స్ అయి వ్యాపారాల్లో నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. వ్యాపారాల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఎగవేతలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button