తెలంగాణ
Obulapuram mining case: ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు

obulapuram mining case: ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఐదుగురిని దోషులుగా తేల్చింది న్యాయస్థానం. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ కృపానందాన్ని నిర్దోషులుగా తేల్చింది. అయితే, 2004- 2009 వరకు గనులశాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
అలాగే, ఈ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీని నిర్దోషిగా తేల్చింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఐదుగురిని దోషులుగా తేల్చింది. ఏ1 శ్రీనివాస్ రెడ్డి, A2 గాలికి జనార్ధన్ రెడ్డి, A3 వీడీ రాజగోపాల్, A7 మెఫజ్ అలీఖాన్‌లను దోషులుగా పేర్కొంది. ఇక, శ్రీనివాస్ రెడ్డి, గాలికి జనార్ధన్ రెడ్డి, గాలి పీఏకు లక్ష రూపాయల జరిమానాతో పాటు అందరికీ ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు.