ఆఫర్లు లేక ఐటమ్ సాంగ్స్ చేస్తున్న బ్యూటీ?

హాట్ నటి కేథరిన్ థెరిస్సా కెరీర్‌లో మరోసారి ఐటమ్ సాంగ్‌కు అంగీకారం తెలిపింది. సందీప్ కిషన్ హీరోగా వస్తున్న ‘సిగ్మా’లో పెప్పీ సాంగ్ చేయనుంది. గతంలో జయ జానకి నాయక, గ్యాంగర్స్ సినిమాల్లోనూ స్పెషల్ సాంగ్స్‌లో రెచ్చిపోయింది. ఈసారి ఈ పాట ఆమెకు మరిన్ని ఆఫర్లు తెచ్చిపెడుతుందా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
హాట్ నటిగా పేరు తెచ్చుకున్న కేథరిన్ థెరిస్సా మళ్లీ ఐటమ్ సాంగ్ బాట పట్టింది. విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సిగ్మా’ చిత్రంలో సందీప్ కిషన్‌తో కలిసి స్పెషల్ సాంగ్‌లో అదరగొట్టనుంది. గతంలో ‘జయ జానకి నాయక’, ‘గ్యాంగ్‌స్టర్’ సినిమాల్లోని సాంగ్స్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి.
15 ఏళ్ల కెరీర్‌లో ‘ఇద్దరమ్మాయిలతో’, ‘సరైనోడు’, ‘బింబిసార’ తప్ప చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోవడంతో ఆమె సెకండ్ హీరోయిన్, సపోర్టింగ్ రోల్స్‌కే పరిమితమవుతోంది. ప్రస్తుతం ‘మన శంకర్ వరప్రసాద్’, ‘ఫణి’ సినిమాలు చేస్తోంది. ఈ ఐటమ్ సాంగ్‌తో మళ్లీ హీరోయిన్ ఆఫర్లు పెరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.



