సినిమా

Trisha: పెళ్లిపై త్రిష షాకింగ్ కామెంట్స్

Trisha: సీనియర్ హీరోయిన్ త్రిష కెరీర్‌లో బిజీగా ఉంటూ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలతో అభిమానులను ఆశ్చర్యపరిచారు. 41 ఏళ్లు దాటినా సింగిల్‌గా ఉన్న ఈ స్టార్ హీరోయిన్ పెళ్లి గురించి ఏమన్నారో? తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’, కమల్ హాసన్‌తో ‘థగ్ లైఫ్’ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న త్రిష, ‘థగ్ లైఫ్’ ప్రమోషన్స్‌లో పెళ్లిపై తన మనసులో మాట బయటపెట్టారు. “పెళ్లిపై నాకు పెద్దగా నమ్మకం లేదు. అందుకే దానికి దూరంగా ఉన్నాను. పెళ్లి జరగకపోయినా నాకు ఎలాంటి బాధ లేదు,” అని స్పష్టం చేశారు.

తన కెరీర్, సినిమాలు, ఫ్యామిలీపైనే ఫోకస్ చేస్తున్నానని, పెళ్లి జరిగితే ఓకే, లేకపోయినా సమస్య లేదని తేల్చేశారు. “పెళ్లి, పిల్లలు నాకు సెట్ కాకపోవచ్చు,” అని క్రేజీ కామెంట్స్ చేశారు. గతంలో ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ విఫలమైన నేపథ్యంలో త్రిష వ్యాఖ్యలు అభిమానులను షాక్‌కు గురిచేశాయి. “త్రిష ఇంత ఓపెన్‌గా ఎందుకు మాట్లాడింది?” అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button